నెల్లూరు టు తిరుపతి.. పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పాదయాత్ర

by Vemula.Srinu Prasad |

సనాతన ధర్మ పరిరక్షణ కోసం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి తిరుమలకు జనసేన నాయకులు చేస్తున్న పాదయాత్ర తిరుపతి చేరుకుంది....

నెల్లూరు టు తిరుపతి.. పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పాదయాత్ర
X

దిశ, వెబ్ డెస్క్: సనాతన ధర్మ పరిరక్షణ(Sanatana Dharma Preservation) కోసం నెల్లూరు జిల్లా ఆత్మకూరు(Sanatana Dharma Preservation) నుంచి తిరుమల(Tirumala)కు జనసేన(Janasena) పార్టీ నాయకులు చదలవాడ హరీష్ కుమార్, చదలవాడ మృదుల, నూనె హరీష్ యాదవ్, అక్బర్ బాషా, దాడి భాను కిరణ్ చేస్తున్న 150 కిమీర్ల పాదయాత్ర 5వ రోజున తిరుపతి చేరుకుంది. వీరికి తిరుపతి లీలామహల్ కూడలి వద్ద తిరుపతి జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి, శ్రీ కాళహస్తి ఆలయ ఛైర్మన్ కొట్టేసాయి, ఇతర జనసేన నాయకులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు.

సనాతన ధర్మ పరిరక్షణ కోసం...


ఈ సందర్భంగా చదలవాడ హరీష్ కుమార్, రాజా రెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ పాదయాత్రను చేపట్టామని, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా నిలవాలని, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం నెయ్యిలో కల్తీ జరిగిన ఘటనను ఖండించాలన్నారు. కల్తీ నెయ్యిపై దోషులకు శిక్ష కచ్చితంగా పడాలని డిమాండ్ చేశారు. అలిపిరి బాట మార్గాన తిరుమలకు చేరి కుట్రపూరితంగా కల్తీ నెయ్యికి పాల్పడి, కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే సనాతన ధర్మాన్ని పరిరక్షణ కోసం బోర్డు ఏర్పాటు చేయాలనే పవన్ కల్యాణ్ అభ్యర్ధనకు మద్దతుగా ఈ పాదయాత్ర ను తలపెట్టామని చదలవాడ హరీష్ పేర్కొన్నారు.

Next Story