తెగిన పడవల తాళ్లు.. పెన్నా వారధి వద్ద తప్పిన పెనుప్రమాదం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-29 09:39:38  IST  )

నెల్లూరు జిల్లాపై మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. ప్రస్తుతానికి వర్షం తెరపించినా..

తెగిన పడవల తాళ్లు.. పెన్నా వారధి వద్ద తప్పిన పెనుప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాపై మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. ప్రస్తుతానికి వర్షం తెరపించినా.. నిన్నటి నుంచీ కురిసిన భారీ వర్షానికి పెన్నానదికి భారీగా వరద పోటెత్తింది. దీంతో ఇసుకను తరలించేందుకు నది వద్ద ఉంచిన మూడు పడవలను పక్కనే ఉన్న వంతెనకు కట్టి ఉంచారు. వరద ఉద్ధృతికి ఆ పడవల తాళ్లు తెగిపోయి కొట్టుకుపోయి నది గట్టున ఆగాయి. మూడు పడవలు వారధి గేట్లకు తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ పడవలు వారధి గేట్లకు తగిలి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదోనని అధికారులు ఆందోళన చెందారు.

మరోవైపు తెల్లపాడు వాగు వద్ద రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తుండటంతో ఏఎస్ పేట - ఆత్మకూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోగోలు మండలంలో చెప్పలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బిట్రగుంట ఎస్సై ఇరువైపులా కంచె వేయించారు.

RAD MORE .....

కిరండోల్ రైల్వే లైన్ ధ్వంసం.. పల్నాడు జిల్లాను ముంచెత్తిన వరద

Next Story