Nellore: రాష్ట్రవ్యాప్తంగా జనసేనను ఆదరిస్తున్నారు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీకి మంచి ఆదరణ ఉందని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు...

Nellore: రాష్ట్రవ్యాప్తంగా జనసేనను ఆదరిస్తున్నారు
X

దిశ, నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీకి మంచి ఆదరణ ఉందని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరేనని అందరూ నమ్ముతున్నారని పేర్కొన్నారు. ఆదివారం కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలోని కార్యకర్తలంతా క్రమశిక్షణ, నిబద్ధతతో వ్యవహరించాలని చెప్పారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైనా కూడా దానికి కట్టుబడి జనసేనను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై మండల అధ్యక్షుడి సాయంతో పోరాడి బాధితులకు న్యాయం కల్పించే విధంగా పార్టీ లీగల్ కమిటీ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Next Story