- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > రాష్ట్రంలో అభివృద్ధి ప్రశ్నార్ధకం: జనసేన నేత కిషోర్
రాష్ట్రంలో అభివృద్ధి ప్రశ్నార్ధకం: జనసేన నేత కిషోర్
by Vemula.Srinu Prasad |
నెల్లూరు రూరల్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ విమర్శించారు. ...

X
దిశ, నెల్లూరు: నెల్లూరు రూరల్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ విమర్శించారు. వైసీపీ నాయకులు వర్గ పోరుతో అభివృద్ధి గాలికి వదిలేశారని విమర్శించారు. కిషోర్ జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపులో నెల్లూరులోని 2వ డివిజన్‌లో ఆయన పర్యటించారు. ప్రతిగడపగడపకు వెళ్తు కుటుంబ సభ్యుల మద్దతు కోరుతూ జనసేన పార్టీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. నెల్లూరు రూరల్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారని, కానీ వాటిని ఎవరు పూర్తి చేయాలో అర్ధం కావట్లేదన్నారు. నియోజకవర్గం వైసీపీ నాయకుల వర్గపోరుతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. పదవులకై పాకులాడే వారికి కాక ప్రజల సమస్యలపై పోరాడే నాయకులను ఎన్నుకోవాలని కిషోర్ పిలుపునిచ్చారు.
Next Story






