- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి చోటా పోటీ చేస్తాం: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
రాష్ట్రంలోనే కోవూరు నియోజకవర్గం డెల్టా ప్రాంతం చైతన్యవంతమైన నియోజకవర్గమని స్థానిక ఎన్నికల్లో ప్రతిచోట వైసిపి పోటీ చేస్తుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు..

దిశ, కోవూరు: రాష్ట్రంలోనే కోవూరు నియోజకవర్గం డెల్టా ప్రాంతం చైతన్యవంతమైన నియోజకవర్గమని స్థానిక ఎన్నికల్లో ప్రతిచోట వైసిపి పోటీ చేస్తుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం రుక్మిణి కళ్యాణ మండపంలో వైసీపీ మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వెన్ను పోటుకు రెండేళ్లు కార్యక్రమంలోభాగంగాకోవూరులో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇటీవల టిడిపి వాళ్లను చూసి వైసిపి వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే వణుకు పుట్టేలా చర్యలు చేపట్టాలని నడ మంత్రపు సిరి ఆదేశాలు ఇచ్చిందన్నారు.కోవూరు నియోజకవర్గంలో అంతసులువు కాదని, అప్పట్లో సుబ్బరామిరెడ్డి సైతం నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గముతోనైనా పెట్టుకోవచ్చు గానీ కోవూరు నియోజకవర్గ ప్రజలతో పెట్టుకోవద్దన్నారు. అలాంటి చైతన్య కలిగిన ప్రజలు అన్ని గమనిస్తుంటారన్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోట వైసిపి పోటీలో ఉంటుందన్నారు. ప్రతి నాయకులు కార్యకర్తలు ఓటర్ల జాబితాను దగ్గరుండి నమోదు చేయించాలని సూచించారు.
అనంతరం మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్లలో చేసింది అంతా మోసమేనన్నారు. స్త్రీ నిధి ఇవ్వలేకపోయానని ఒప్పుకొని దానిని పీఫోర్ తో అనుసంధానించానని చెప్పడం సిగ్గు చెటన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి. చలపతిరావు, వైసీపీ నాయకులు అనుప్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






