చంద్రబాబు సీఎం అయితేనే ఆదాయం: మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల

by Disha Web Desk 16 |
చంద్రబాబు సీఎం అయితేనే ఆదాయం: మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల
X

దిశ, వెంకటగిరి: చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్ర ఆదాయం గాడిలో పడుతుందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. డక్కిలి మండలం దగ్గవోలులో ఇదేం ఖర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటి ఇంటికి ఇదేమి కర్మ కార్యక్రమంపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించారు. అనంతరం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలపై మాట్లాడారు. అనంతరం దగ్గవోలు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు 20 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలోని మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీ, పార్లమెంట్, అనుబంధ కమిటీ సభ్యులు నియోజకవర్గ అనుబంధ కమిటీ, మండల కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, యూనిట్ ఇంచార్జిలు, అన్ని గ్రామముల ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, దగ్గవోలు గ్రామ పార్టీ నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed