- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
అక్రమ కేసులపై ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు..

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జైలు(Nellore Jail)లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(Former MLA Gopireddy Srinivasa Reddy) పరామర్శించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy)తో కలిసి ములాఖత్‌లో కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లి సోదరులను అన్యాయంగా, అక్రమంగా జైలుకు పంపారని ఆరోపించారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే వైసీపీ నేతలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందన్నారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకటరామిరెడ్డి మీద కక్షసాధింపు చర్యలో భాగంగానే ఈ కేసులు పెట్టారని ఆరోపించారు. ‘‘రెండు సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం, రెండు సంవత్సరాలు ఇబ్బంది పెడతారేమో. ఈ రెండు సంవత్సరాల తర్వాత ఏంటి పరిస్థితి అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి అక్రమ కేసులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని వదిలిపెట్టేది లేదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి వెనుకాడం.’’ అని హెచ్చరించారు.






