Breaking: కోవూరు మాజీ MLA ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి

by Vemula.Srinu Prasad |

కోవూరు మాజీ MLA ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దుండగులు దాడి చేశారు....

Breaking: కోవూరు మాజీ MLA ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: కోవూరు మాజీ MLA ప్రసన్నకుమార్‌రెడ్డి(Former Kovur MLA Prasanna Kumar Reddy) ఇంటిపై దుండగులు దాడి చేశారు. స్థానిక MLA ప్రశాంతిరెడ్డి(MLA Prashanthi Reddy)పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని దాడికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో లేరు. కానీ ఫర్నీచర్‌, కారు ధ్వంసం అయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు వైసీపీ కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మండిపడ్డారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story