- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బసినేనిపల్లి టీడీపీలో విభేదాలు.. ఇద్దరికే ప్రాధాన్యతపై అసంతృప్తి
ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం బసినేనిపల్లి పంచాయతీలో తెలుగు దేశం పార్టీలో అసంతృప్తి బయటపడుతోంది....

దిశ, ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం బసినేనిపల్లి పంచాయతీలో తెలుగు దేశం పార్టీలో అసంతృప్తి బహిరంగంగా బయటపడుతోంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం చెమటోడ్చిన సీనియర్ నాయకులను పక్కనబెట్టి కేవలం ఇద్దరికే ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారుప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి గట్టిగా ఎదురు నిలబడి, పార్టీ జెండాను ఎగరవేసిన నాయకులు ఇప్పుడు గుర్తింపే లేకుండా పోయారనే ఆవేదన వ్యక్తమవుతోంది.
“పంచాయతీలో పార్టీ కోసం కష్టపడింది వాళ్ళిద్దరేనా? మిగతా నాయకులు లేరా?” అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మండల నాయకత్వం ఎందుకు ఇద్దరినే ముందుకు తెస్తోంది?, సీనియర్ల అనుభవం, పాత కార్యకర్తల త్యాగాలు విలువలేనివేనా? అనే చర్చ జోరుగా సాగుతోంది. స్థానికంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారగా పార్టీ ఉన్నత నాయకత్వం జోక్యం చేసుకుని అందరినీ కలుపుకుని వెళ్లాలనే డిమాండ్ వినిపిస్తోంది. లేదంటే ఈ అసంతృప్తి భవిష్యత్తులో పార్టీకి నష్టమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.






