Congress Focus on Ap: మాజీ ఎంపీ చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Congress Focus on Ap: మాజీ ఎంపీ చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, నెల్లూరు: 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవంతోనే మాజీ ఎంపీ, సిడబ్ల్యుసి సభ్యులు చింతామోహన్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీలతో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారని, ప్రస్తుత తరుణంలో నూతన పరిపాలనకు స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. కర్ణాటకలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పుతున్న బిజెపి సైతం తోక ముడుచుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రజా నిర్ణయాలు ఆ విధంగా ఉంటాయని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వైసీపీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత అధిక ధరలతో పాటు సామాన్య ప్రజలకు రక్షణ కరువైందన్నారు. ఆకలి ఏంటో తెలియని ప్రభుత్వ పరిపాలనా లేని నేతలకు పేద ప్రజల జీవన గమన సరళ గురించి ఏమి తెలుస్తుందని ప్రశ్నించారు. పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న బిజెపి వైకాపాలకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్యను అందించేందుకు పలు రకాల విద్యాభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టామని చెబుతున్న వైసీపీకి, పలు యూనివర్సిటీల విద్య దూరమైందనే సంగతి ఎందుకు తెలియదన్నారు.

గత కాంగ్రెస్ పరిపాలనలో పేద ప్రజలకు ప్రభుత్వం అందజేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంకను మర్చిపోలేని పరిస్థితి ఉందన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తేనే సామాన్య ప్రజలకు మనుగుడా సాధ్యమవుతుందన్నారు. బిజెపిని వైకాపాలను రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇంటికి పంపెందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story