నెల్లూరుకు చెందిన లేడీ డాన్ కు కోర్టు రిమాండ్

by Thanuru Gopichand |

లేడీ డాన్ గా (Lady Don) గుర్తింపు పొందిన నెల్లూరుకు చెందిన అరుణకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది.

నెల్లూరుకు చెందిన లేడీ డాన్ కు కోర్టు రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : లేడీ డాన్ గా (Lady Don) గుర్తింపు పొందిన నెల్లూరుకు చెందిన అరుణకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. నవంబరు 14 వరకు రిమాండ్ కొనసాగనుంది. వివరాల్లోకి వెళ్తే 2021లో రమేశ్ బాబు అనే వ్యక్తి అరుణను కలిశారు. తన బంధువులకు ఉద్యోగం విషయంలో సహకరించాలని కోరారు. అందుకు గానూ 12 లక్షల రూపాయల నగదు ముట్టజెప్పారు. అయితే నెలలు గడుస్తున్నా కూడా ఉద్యోగం విషయంలో అరుణ (Aruna) నుంచి స్పందన లభించలేదు. పలుమార్లు కలిసినా కూడా ఉద్యోగం రాలేదు. నెలలు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో బాధితుడు అరుణను నిలదీశారు.

దీంతో ఆగ్రహానికి గురైన అరుణ రమేశ్ బాబును నెల్లూరుకు పిలిపించి బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన అతను అప్పటి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తాజాగా బాధితుడు విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులకు తాను మోసపోయినట్లు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండులో ఉన్న అరుణను పోలీసులు పీటీ వారెంట్ పై విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడ కోర్టులో (Vijayawada Court) హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండును విధించింది. అనంతరం నిందితురాలిని నెల్లూరు కేంద్ర కారాగానికి పోలీసులు తరలించారు.

Next Story