- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి కార్యకర్తకు అభినందనలు : మంత్రి నారాయణ
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగే సహాయక చర్యల్లో భాగమవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగే సహాయక చర్యల్లో భాగమవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వారి పిలుపుతో పార్టీ శ్రేణులు అధికార యంత్రాంగంతో కలిసి స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రభావిత ప్రాంత ప్రజలకు తమవంతు సహాయం చేస్తున్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో సిబ్బందికి సహకరిస్తున్నారు. అవసరమైన చోట నేలకూలిన చెట్ల తొలగింపు, ట్రాఫిక్ మళ్లింపు కోసం తమ వంతు సహాయం చేస్తున్నారు. తద్వారా మేమున్నాం అంటూ ప్రజలకు భరోసానిస్తున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ నెల్లూరులోని కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు నెల్లూరు నగరంలోని కార్యకర్తలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను అందించారు. కొంత మంది బాధితులకు టార్పాలిన్ కవర్లను కూడా పంపిణీ చేశారు. తన విజ్ఞప్తిపై స్పందించి ప్రజాసేవకు సమయాన్ని కేటాయించడం పట్ల మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.






