- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, నెల్లూరు: గ్రీన్ హోం వారి వన్ వరల్డ్ వెంచర్‌ను సింహపురి ప్రజలు సందర్శించి ఆదరించాలని గ్రీన్ ఓం వన్ వరల్డ్ వెంచర్ నిర్వాహకులు బొల్లినేని శ్రీహరి నాయుడు పిలుపునిచ్చారు. వెంచర్ అన్ని వసతులతో అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో తమ ఖాతాదారులకు ఎన్నో అద్భుతమైన వెంచర్లు అందించామని, ఆ అనుభవంతో నెల్లూరు నగరానికి సమీపంలో నేషనల్ హైవేకి దగ్గర్‌లో, చెముడుగుంట ప్రాంతంలో 150 ఎకరాల్లో తమ సంస్థ నుంచి మరో అద్భుతమైన వన్ వరల్డ్ వెంచర్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
ఖాతాదారులకు అన్ని వసతులు ఏర్పాటు చేసిన తర్వాతే తమ వెంచర్‌ను అమ్మకాలలో పెట్టడం జరిగిందన్నారు. అలాగే తమ వెంచర్లు గ్రూప్ అపార్ట్ మెంట్స్ ,విల్లాస్ నిర్మిస్తామని ఆయన తెలియజేశారు. సింహపురి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ హోం సిబ్బందితోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపార మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.






