- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > నారా లోకేశ్ పాదయాత్రపై వైసీపీ కుట్ర: బీదా రవిచంద్ర
నారా లోకేశ్ పాదయాత్రపై వైసీపీ కుట్ర: బీదా రవిచంద్ర
by Vemula.Srinu Prasad |
ప్రజాభిమానం మధ్య కొనసాగుతున్న లోకేష్ యువగళం పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ఆరోపించారు.....

X
దిశ, నెల్లూరు: ప్రజాభిమానం మధ్య కొనసాగుతున్న లోకేష్ యువగళం పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ఆరోపించారు. తంబళ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 రోజులుగా రకరకాలుగా అవాంతరాలు కల్పిస్తున్నారని, పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో లోకేష్ బృందం బస చేసిన ప్రాంతాన్ని ఖాళీ చేయమని తహశీల్దార్ ఆదేశించడంలో అర్థం లేదన్నారు. వివాదాస్పద స్థలంలో బస చేశారని అభ్యంతరం తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రశాంతంగా జరుగుతున్న పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు రచ్చలు సృష్టించాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






