నెల్లూరులో జాతీయరహదారిపై మరో అండర్ పాస్

by Thanuru Gopichand |

నెల్లూరులోని జాతీయ రహదారిపై మరో అండర్ పాస్ (Under Pass) నిర్మాణం జరగనుంది.

నెల్లూరులో జాతీయరహదారిపై మరో అండర్ పాస్
X

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరులోని జాతీయ రహదారిపై మరో అండర్ పాస్ (Under Pass) నిర్మాణం జరగనుంది. అందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వివరాల్లోకి వెళ్తే చింతారెడ్డిపాలెం క్రాస్ (Chintha Reddy Palem) రోడ్డు వద్ద ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. అందుకు పరిష్కారం చూపాలని నెల్లూరువాసులు విన్నవిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ (Minister Narayana) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై (National Highway) బ్రిడ్జి నిర్మాణానికి ముందడుగు వేశారు. విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి అడర్ పాస్ నిర్మాణానికి అనుమతులను సాధించారు. అంతేకాకుండా రూ.121 కోట్ల నిధులను కూడా మంజూరు చేయించారు.

ఈ ప్రాంతం నుంచి నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. జాతీయ రహదారి కావడంలో వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. ఆ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ట్రాఫిక్ సమస్య కూడా అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో హైవేపై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చించారు. మంత్రి నారాయణ చూపిన చొరవతో ఏళ్ల నాటి కల త్వరలో సాకారం కానుంది. ఎన్నో ఏళ్ల నాటి నెల్లూరువాసుల (Nellore Residents) కలను సాకారం చేస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నిరంతర కృషికి నెల్లూరువాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రమాదాల నివారణతో పాటు రాకపోకలకు అలువుగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story