నెల్లూరు జిల్లాలో ఘోరం.. దంపతులు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

నెల్లూరు జిల్లాలో ఘోరం.. దంపతులు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore Disterict)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో(Auto)ను స్కూటర్(Scooter) ఢీకొట్టింది. తిప్పవరప్పాడు-సైదాపురం రోడ్డులో ఈ ఘటన జరిగింది. ప్రమాదం(Accident)లో దంపతులు స్పాట్‌లోనే మృతి చెందారు. కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అంచనా వేశార. మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాలు నడిపే క్రమంలో రోడ్డు రూల్స్ పాటించాలని వాహనదారులకు సూచించారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయాలని చెప్పారు. రోడ్డు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పదని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

Next Story