నెల్లూరులో దారుణం.. కత్తితో భార్యను పొడిచి చంపిన భర్త

by Vemula.Srinu Prasad |

నెల్లూరులో భార్యను అత్యంత కిరాతకంగా భర్త చంపేశారు...

నెల్లూరులో దారుణం.. కత్తితో భార్యను పొడిచి చంపిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)లో దారుణం జరిగింది. భార్య(Wife)ను అత్యంత కిరాతకంగా భర్త(Husband) చంపేశారు. భార్యభర్తలు శ్రీహరి, నందిని మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. దీంతో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. శ్రీహరి నెల్లూరులోనే ఉండగా నందిని బెంగళూరు(Bengaluru)లో జాబ్ చేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం నందిని నెల్లూరు వచ్చారు. దీంతో ఆమెను భర్త శ్రీహరి రిసీవ్ చేసుకున్నారు. మార్గమధ్యలో భార్య నందినిని కత్తితో పొడిచి చంపారు. అనంతరం అక్కడి నుంచి శ్రీహరి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందినిని భర్త శ్రీహరి ఎందుకు చంపారనే కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story