Nellore: బైక్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

నెల్లూరు జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది...

Nellore: బైక్‌ను ఢీకొన్న కారు..  ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District)లో కారు(Car) బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి వేగంగా వెళ్లి బైక్‌(Byke)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. రాపూరు తిక్కన పార్కు(Rapur Thikkana Park) వద్ద ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతులు సరస్వతి, సురేశ్‌గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన బైక్, కారును పక్కకు తీశారు. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికుల నుంచి తెలుసుకున్నారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story