సర్వేపల్లిలో Tdpకి షాక్.. Ycpలోకి మాజీ జడ్పీటీసీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-12-17 15:34:42  IST  )

సర్వేపల్లిలో Tdpకి షాక్.. Ycpలోకి మాజీ జడ్పీటీసీ
X

దిశ నెల్లూరు: వెంకటాచలం మండలం పరిధిలోని షర్డ్స్ కళ్యాణ మండపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు, ప్రముఖ బీసీ నాయకుడు రాచాల రవికుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీని వీడి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవికుమార్‌కు పార్టీ కండువా వేసి మంత్రి కాకాణి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో ప్రజా రంజికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, ఎంతోమంది వైసీపీ వైపు ఆకర్షితులవుతున్నారని కాకాణి పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారని పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.

Next Story