- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ.. నేటి నుంచి 'మహా కుంభాభిషేకం' ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేక వేడుకలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి అరుదైన ఆధ్యాత్మిక వేడుక ప్రారంభమైంది. ఆలయ శాస్త్రోక్త సంప్రదాయం ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ‘మహా కుంభాభిషేకం (Maha Kumbha Abhishekam) వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగనుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే దోషాలను నివారించడానికి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మహా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి ప్రతి పుష్కర కాలానికి 12 ఏళ్లకు ఒకసారి ఈ క్రతువును నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
కాగా, నేటి నుంచి ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠాపన వంటి వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరి రోజున ప్రధాన కుంభాభిషేకం జరగనుంది. ఈ సందర్బంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శన వేళల్లో మార్పులు ఉంటాయని, భక్తులు సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు.






