నేడు అర్నాలా యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న నౌకాదళం.. దాని స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?

by Naga Rani Yarlagadda |

భారత నౌకాదళం నేడు (జూన్ 18) విశాఖపట్టణంలోని నావల్ డాక్‌యార్డ్‌లో INS అర్నాలా అనే యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) యుద్ధనౌకను జాతికి అంకితం చేయనుంది.

నేడు అర్నాలా యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న నౌకాదళం.. దాని స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత నౌకాదళం నేడు (జూన్ 18) విశాఖపట్టణంలోని నావల్ డాక్‌యార్డ్‌లో INS అర్నాలా అనే యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) యుద్ధనౌకను జాతికి అంకితం చేయనుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు.

INS అర్నాలా యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC). 16 స్వదేశీ యుద్ధనౌకల సిరీస్‌లో ఇది మొదటిది. 80% కంటే ఎక్కువ స్వదేశీ సామగ్రితో నిర్మితమయింది. శత్రు జలాంతర్గాములు, డ్రోన్‌లను సముద్రంలో అడ్డుకునే అత్యాధునిక సామర్థ్యాలు కలిగి ఉంది. భారత తీర రక్షణను బలోపేతం చేస్తుంది. 1972-1999 మధ్య సేవలందించిన INS అర్నాలా గౌరవార్థం దీనికి ఆ పేరు పెట్టారు. ఓడ గుర్తుగా డిజైన్ చేయబడిన క్రెస్ట్‌లో ఆగర్ షెల్‌తో పాటు దేవనాగరి లిపిలో ఓడ పేరు ఉంటుంది. ఈ యుద్ధనౌకను హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ విశాఖపట్టణం వద్ద నిర్మించింది. ఆత్మనిర్భర్ భారత్ (Atma Nirbhar Bharat)కు సంకేతంగా నిలుస్తుంది. ఈ యుద్ధనౌక తూర్పు నౌకాదళ కమాండ్‌లో చేరనుంది. భారత నౌకాదళ శక్తిని మరింత పటిష్ఠం చేస్తూ.. సముద్ర రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది.

అధునాతన సోనార్ టెక్నాలజీ (హల్-మౌంటెడ్, టోవెడ్ అరే సోనార్)తో సిద్ధంచేసిన అర్నాలా.. జలాంతర్గాములను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది షాలో వాటర్‌లో శత్రు జలాంతర్గాములను ఖచ్చితంగా గుర్తిస్తుంది. సముద్ర ఉపరితల గస్తీ, డ్రోన్ గుర్తింపు కోసం అధునాతన రాడార్‌లను అమర్చారు. ఇవి గాలి, నీటి లక్ష్యాలను ట్రాక్ చేయగలవు. టార్పెడోలు, డెప్త్ చార్జ్‌లు, యాంటీ-సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్‌లు, జలాంతర్గాములను నాశనం చేయడానికి రూపొందించారు. గాలి లక్ష్యాలను ఎదుర్కొనేందుకు యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్, సముద్ర ఉపరితల లక్ష్యాలను లక్ష్యంగా చేసుకునే మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి.

శత్రు కమ్యూనికేషన్‌లను జామ్ చేయడానికి, ఎలక్ట్రానిక్ దాడులను తిప్పికొట్టడానికి అధునాతన ఎలక్ట్రానిక్ కౌంటర్‌మెజర్స్ సైతం ఉన్నాయి. ఇంధన సామర్థ్యం గల డీజిల్ ఇంజన్‌లు, షాలో వాటర్ ఆపరేషన్స్ కోసం అధిక చలనశీలత, వేగాన్ని అందిస్తాయి. రాడార్ క్రాస్-సెక్షన్‌ను తగ్గించే డిజైన్.. శత్రు గుర్తింపు నుండి రక్షణ కల్పిస్తుంది. షాలో వాటర్ ఆపరేషన్స్ కోసం రూపొందించబడిన ఈ నౌక తీరప్రాంత రక్షణలో సమర్థవంతంగా పనిచేస్తుంది. రియల్-టైమ్ డేటా ఇంటిగ్రేషన్, నిర్ణయాధికారం కోసం అధునాతన కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఇతర నౌకాదళ యూనిట్లు, వైమానిక దళాలు, తీర రక్షణ వ్యవస్థలతో సమన్వయం కోసం సమాచార భాగస్వామ్య వేదికలు ఉన్నాయి.

Next Story