అర్థనగ్న కాల్స్ కేసు: నిందితుడి వేటలో స్పెషల్ టీమ్స్.. ముమ్మరంగా గాలింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-17 08:32:10  IST  )

అర్థనగ్న ఫోన్‌కాల్స్, చాటింగ్ వ్యవహారం గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు..

అర్థనగ్న కాల్స్ కేసు: నిందితుడి వేటలో స్పెషల్ టీమ్స్.. ముమ్మరంగా గాలింపు
X

దిశ, వెబ్ డెస్క్: అర్థనగ్న ఫోన్‌కాల్స్, చాటింగ్ వ్యవహారం(Semi-nude phone calls and chatting) గుంటూరు జిల్లా తెనాలి(Guntur District Tenali)లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. స్ట్రిప్ టాక్ పేరుతో ఓ యువకుడు తెనాలి చెంచుపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు చెల్లించిన వారితో ఈ పోర్టల్ ద్వారా మహిళలు న్యూడ్ చాటింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానికుల నుంచి సమాచారం అందడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోర్టల్ నిర్వాహకుల కోసం స్పెషల్ టీమ్స్‌తో గాలింపు చర్యలు చేపట్టారు.

పోర్టల్ నిర్వహకులు ఎవరు..?

అయితే ఆ పోర్టల్ నిర్వహకులు ఎవరు..?. ఇంతకుముందు ఏం చేశారు. ఇప్పటి వరకూ ఎన్ని న్యూడ్ చాటింగ్ చేశారు. దీని వెనుకున్న అసలు సూత్రదారులు ఎవరు..?, ఎవరెవరితో లింకులు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో ఈ కేసును ఛేదించి నిందితుపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Next Story