భార్య అర్ధరాత్రి వరకు మరిదితో అదే పనిలో బిజీ.. భర్త చూడటంతో.. 

by Dishanational1 |
భార్య అర్ధరాత్రి వరకు మరిదితో అదే పనిలో బిజీ.. భర్త చూడటంతో.. 
X

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ అనేది మనం వాడేదాన్ని బట్టి మంచి లేదా చెడు చేస్తుంది. మంచిగా ఉపయోగించుకుంటే ఎదుగుదలకు అది ఎంతగానో దోహదం చేస్తుంది. కానీ, మరో విధంగా వాడుకుంటే అది మన మీదే పెత్తనం చేసి నాశనానికి దారి తీస్తుంది. ఇందుకు ఉదాహరణే ఇటీవల ఏపీలో జరిగిన ఓ ఘటన. ఇద్దరు పిల్లలుండి, చక్కటి భర్త ఉన్నా కూడా ఓ వివాహిత తన మరిదితో చాటింగ్ మాయలో పడింది. విషయం ఇంట్లో తెలిసేసరికి మరిదితో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం... ఏపీకి చెందిన ఓ వివాహితకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంసారం ఏ గొడవలు లేకుండా సాఫీగా ముందుకు సాగుతోంది. అయితే, ఆమెకు వరుసకు మరిది అయ్యే దూరపు బంధువు సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా రోజూ గంటలకొద్దీ చాటింగ్ చేసుకునే వరకు వెళ్లింది. అర్ధరాత్రి వరకు ఇద్దరూ చాటింగ్ లో బిజీగా ఉండేవారు. ఈ చాటింగ్ మాయలో భర్త, పిల్లలను పట్టించుకోవడం పక్కనపెట్టేసింది. దీంతో భర్తకు అనుమానమొచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య ఫోన్ తీసుకుని కాల్స్, మెసేజెస్ చూసిన భర్తకు, ఆమె రోజూ మరిదితో గంటల తరబడి చాటింగ్ చేస్తున్న విషయం తెలిసిపోయింది.

ఈ వ్యవహారం భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీసింది. చాటింగ్ మానుకోవాలంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు భర్త. ప్రవర్తన మార్చుకుని కుటుంబం మీద ధ్యాస పెట్టాలని హెచ్చరించాడు. ఈ విషయాన్ని ఆమె తన మరిదికి చేరవేయడంతో.. అతను అతడుంటున్న చోటు నుంచి అక్కడకు చేరుకున్నాడు. తర్వాత ఆ మహిళ తన ఇంట్లో ఓ లెటర్ రాసి పెట్టి మరిదితో కలిసి బయటకు వెళ్లింది. ఇద్దరూ కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆమె రాసిన లేఖలో.. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, జీవితం నచ్చకనే చనిపోతున్నానని, తన పిల్లలను బాగా చదువుకోమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరిదితో ఉన్న రిలేషన్ గురించి ఇంట్లో తెలియడంతోనే.. వారిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు, బంధువులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

READ MORE

పని మనిషితో బెడ్‌పై రెచ్చిపోయిన వృద్ధుడు.. శృంగారం చివరి క్షణంలో..

శృంగార భార్య.. ఒకరితో ఎఫైర్.. భర్తకు తెలిసిందని ఐదుగురితో రొమాన్స్.. చివరకు ఏం జరిగిందంటే..??

Next Story