- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యేక అధికారులను నియమించాం : ఏపీ ముఖ్యమంత్రి
మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలకు అవసరమైన నిధులను అందుబాటులో ఉంచామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలకు అవసరమైన నిధులను అందుబాటులో ఉంచామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అంతేకాకుండా సహాయ చర్యల కోసం ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో... గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులందరూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా సన్నద్ధం చేశామని తెలిపారు. విద్యుత్, తాగునీరు, రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. వర్షం తీవ్రతను, తుఫాన్ ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.






