TTD: రూ.కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

by Thanuru Gopichand |

లియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.

TTD: రూ.కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రూ. కోటి విరాళం (One Crore) ఇచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో (Tirumala) ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ మేరకు టీటీడీ చైర్మన్​బీఆర్​నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. రూ. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది క్రింది సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది. ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవ మ‌రియు 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీ‌వారి దర్శనం చేసుకోవచ్చు. వీటితోపాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట - 1, రవికే - 1, మహా ప్రసాదం ప్యాకెట్లు - 10, ఒక సారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చు. వీటితో పాటుగా రూ. 3 వేలు రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పిస్తారు. దాతలు టిటిడి అధికారిక వెబ్ సైట్లో ఆన్ లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చు.

Next Story