- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ మీడియా ఛానల్‌కు ప్రత్యేక అభినందనలు’: Minister Nara Lokesh
ఏపీ(Andhra Pradesh) విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఓ మీడియా ఛానల్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఓ మీడియా ఛానల్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల(Govt schools)ల్లో చేపట్టిన సంస్కరణలు, ఫలితాలపై 'మనబడికి మహా న్యూస్' పేరిట ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్న మహా న్యూస్ ఛానల్(Maha News) పై మంత్రి లోకేష్(Minister Nara Lokesh) ఎక్స్(X) వేదికగా స్పందించారు.
ఈ మేరకు ‘‘ప్రభుత్వ విద్యా వ్యవస్థ(Education System)లో మేము చేపట్టిన సంస్కరణలు, వాటి ఫలితాలు "మనబడికి మహా న్యూస్" పేరుతో ప్రసారం చేస్తున్న మహా న్యూస్‌కు అభినందనలు. దేశంలోనే సమున్నతంగా నిలిచేలా కూటమి ప్రభుత్వం(AP Government) ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒకేసారి మహా న్యూస్ చేస్తున్న ఈ ప్రసారాలు ప్రభుత్వ విద్యా వికాసానికి ఎంతో దోహదం చేస్తాయి. తొలిసారిగా ప్రభుత్వ విద్యాలయాల్లో జరిగిన మంచి గురించి నాన్ స్టాప్ కథనాలు చేస్తున్న మహా న్యూస్ యాజమాన్యానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.






