- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్–పాక్ వార్.. జాతీయ రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న విరాళం
ఇండియా–పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసకున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఇండియా–పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసకున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జాతీయ రక్షణ నిధికి విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద నిర్మూలనలో భారత సాయుధ దళాలు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయని చెప్పారు.
భారతదేశం సాయుధ దళాలు చేస్తున్న ధైర్యసాహసాలు ప్రతి భారతీయునిలో గర్వాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు సంఘీభావం తెలిపారు. అలాగే, తన నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు తన నెల జీతం రూ.2,17, 000లను ఆన్ లైన్ ద్వారా జాతీయ రక్షణ నిధికి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు.. రిసిప్ట్‌ను కూడా ఆయన విడుదల చేశారు.






