మంత్రి అనగానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన లేఖ

by Ajay Maddhiboyina |

మంత్రి అనగాని స‌త్య‌ ప్ర‌సాద్‌కు స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న లేఖ రాశారు. విశాఖ ఎండాడ భూ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆదేశించారు.

మంత్రి అనగానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన లేఖ
X

దిశ‌, వెబ్ డెస్క్: మంత్రి అనగాని స‌త్య‌ ప్ర‌సాద్‌కు స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న లేఖ రాశారు. విశాఖ ఎండాడ భూ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆదేశించారు. అసెంబ్లీ స‌మావేశాల కంటే ముందే నివేదిక స‌మ‌ర్పించాల‌ని లేఖలో పేర్కొన్నారు. ఎక్స్ స‌ర్వీస్ మెన్, ఫ్రీహోల్డ్ భూముల క‌బ్జాపై విచార‌ణ జ‌రిపించాల‌న్నారు. చ‌ట్టాల్లో మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే విశాఖలో భారీ కుంభకోణాలు, భూ అక్రమణలు జరిగినట్టు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది.

ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు విశాఖలోని ఎండాడలో కేటాయించిన 12.51 ఎకరాల భూమిని ఇటీవల రద్దు చేసింది. వృధ్దాశ్ర‌మం అనాథ శ‌ర‌ణాల‌యం నిర్మిస్తామ‌ని చెప్పి ప్ర‌భుత్వం నుండి రాయితీ పొందిన హ‌య‌గ్రీవ సంస్థ అస‌లు ఆ ప్రాజెక్టు ప్రారంభించ‌కుండా అక్ర‌మాల‌కు పాల్ప‌డినట్టు అధికారులు గుర్తించారు. ఇలా అనేక అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఆరోప‌ణ‌లు రావడంతో ఎండాడ భూ వ్య‌వ‌హారంపై స‌మగ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని స్పీక‌ర్ లేఖ రాసిన‌ట్టు తెలుస్తోంది.

Next Story