- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Speaker Ayyanna: స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం.. ఆ మీడియా సంస్థకు ప్రివిలేజ్ నోటీసులు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని పట్టబట్టారు. ఈ మొత్తం పరిణామాలపై ఇవాళ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) తీవ్రంగా స్పందించారు. బడ్జెట్ సమావేశాల రెండో రోజు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి సీఎంగా పని చేసిన వ్యక్తి సభ్యతను మరిచి ప్రవర్తించారని జగన్ (Jagan)పై ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించడం సభా సాంప్రదాయాలను మంటగలపడమేనని అన్నారు.
గొడవ చేస్తున్న పార్టీ నాయకులను ఆపాల్సింది పోయి నవ్వడం ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా వైసీపీలో బోత్స సత్యనారాయణ (Botha Satyanarayana) లాంటి అనుభవం కలిగిన నేతలు ఉన్నా మిన్నకుండిపోయారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లోనైనా జగన్ (Jagan) సభలో విజ్ఞతతో వ్యవహరించాలని హితవు పలికారు. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారికి శిక్షణ తరగతులు నిర్వహించకుండానే రూ.కోట్లు వెచ్చించారంటూ తప్పుడు వార్తలు రాశారంటూ నందికొట్కూర్ ఎమ్మెల్యే జయసూర్య (MLA Jayasurya) సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభా హక్కుల కమిటీకి ఆ పత్రిక వార్తలను పరిశీలించాలని ఆదేశించారు. అదేవిధంగా వైసీపీకి బలపరుస్తోన్న ఓ మీడియా సంస్థకు ప్రివిలేజ్ నోటీసులు (Notices of Privilege) ఇవ్వాలని నిర్ణయించారు.






