బాధితులు కంప్లెంట్ చేశారు.. చర్యలు తీసుకంటాం: ఎస్పీ సతీశ్ కుమార్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-18 10:00:43  IST  )

మాజీ సీఎం జగన్ కాన్వాయ్‌ వల్లే సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు..

బాధితులు కంప్లెంట్ చేశారు.. చర్యలు తీసుకంటాం: ఎస్పీ సతీశ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్(Former CM Jagan) కాన్వాయ్‌తో పాటు మరో మూడు వెహికల్స్‌కు మాత్రమే అనుమతించామని, అయితే ఎక్కువగా తరలిరావడంతోనే సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారని ఎస్పీ సతీశ్ కుమార్(SP Satish Kumar) తెలిపారు. లింగాయపాలెం గ్రామంలో జరిగిన ప్రమాదంపై ఆయన స్పందించారు. సింగయ్య మృతిపై బాధితులు ఫిర్యాదు చేశారని, చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటనకు వైసీపీ నాయకులు ప్లాన్ చేశారని, 11 కాన్వాయ్‌లతో పాటు మొత్తం 30 వాహనాలల్లో వైసీపీ నాయకులు తాడేపల్లి నుంచి బయల్దేరారని తెలిపారు. రెండు రూట్లలో ప్రజలు ఉన్నారని, వాహనాలు మార్గ మధ్యలో చాలా కలిశాయని చెప్పారు. ఆ సమయంలో ప్రమాదం జరిగిందని, నల్లపాడుకు చెందిన సింగయ్య మృతి చెందారని తెలిపారు. సింగయ్యపై నుంచి ప్రైవేటు వాహనం వెళ్లిందని చెప్పారు. సింగయ్యను వెంటనే 108లో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారని, చికిత్స పొందుతూ ఆయన చనిపోయారని ఎస్పీ సతీశ్ కుమార్ పేర్కొన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సతీశ్ కుమార్ స్పష్టం చేశారు.

Next Story