- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh: సారీ గాయ్స్.. ఎలాంటి హెల్ప్చేయలేకపోతున్నా..
సారీ గాయ్స్ .. అంటూ నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్చే శారు.

* నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
* పొలాల్లో మద్యం తాగుతున్న ఇద్దరిని గుర్తించిన డ్రోన్లు
* వాటిని చూసి ఇంజనీరింగ్ విద్యార్థులు పరార్
దిశ డైనమిక్ బ్యూరో: సారీ గాయ్స్ .. అంటూ నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ (Tweet) చేశారు. పొలాల్లో మందు కొడుతూ రిలాక్స్ అవుతున్న కుర్రాళ్లను ఉద్దేశించి.. కెనాట్ హెల్ప్ అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లావ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో (Drone camera) నేరాల నియంత్రణకు పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా పోలీసులు (Ap police) గుడివాడ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీ వెనుక వైపు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారని గుర్తించారు. వారిని డ్రోన్ ద్వారా గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఆ వీడియోను కృష్ణ జిల్లా పోలీసులు పోస్ట్ చేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పోలీసులు డ్రోన్ల ద్వారా వారి డ్యూటీ చేశారంటూ సరదాగా కామెంట్ చేశారు. (Dail100)
ఏపీలో డ్రోన్ కెమెరాల ద్వారా అసాంఘిక చర్యలను గుర్తిస్తున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందట ఇటువంటి వీడియోనే మంత్రి అనిత పోస్ట్ చేశారు. ఓ లారీలో కూర్చుని పేకాడుతున్న జూదగాళ్లను డ్రోన్ సహాయంతో గుర్తించారు. అదేవిధంగా ఇప్పుడు కాలేజీ విద్యార్థులు మద్యం సేవిస్తూ దొరికిపోయారు. డ్రోన్ రావటంతో వారు పొలాల వెంబటి పరుగులు తీశారు. ఇప్పుడు ఈ వీడియోలు ఏపీలో వైరల్ గా మారుతున్నాయి. డ్రోన్స్ ద్వారా అసాంఘిక చర్యలను కట్టడి చేస్తున్నట్లు ఏపీ పోలీసులు వెల్లడిస్తున్నారు. నిర్జన ప్రదేశాల్లో మద్యం తాగాలన్న,. మరే అసాంఘిక పని చేయాలన్న నేరస్తులు భయపడిపోతున్నారు. కాలేజీ విద్యార్థులు సైతం ఇటువంటి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేందుకు వెనకాడుతున్నారు. పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలపై ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది.






