Ap News: కన్న తల్లిని రోడ్డుపాలు చేసిన కుమారులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-11-24 16:28:37  IST  )

కన్న తల్లిని రోడ్డు పాలు చేసిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది....

Ap News: కన్న తల్లిని రోడ్డుపాలు చేసిన కుమారులు
X

దిశ, వెబ్ డెస్క్: కన్న తల్లిని రోడ్డు పాలు చేసిన ఘటన ప్రకాశం జిల్లా(Prakasam District)లో జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధతల్లిని కుమారులు యర్రగొండపాలెం ప్రభుత్వ ఆస్పత్రి(Yarragondapalem Government Hospital) సమీపంలోని ఆంజనేయస్వామి గుడి(Anjaneyaswamy Temple) వద్ద వదిలేసి వెళ్లారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లి పట్ల కనికరం చూపలేదు. అనాధలా వదిలేసి వెళ్లిపోయారు. అన్నం కూడా తినలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు అష్టకష్టాలు పడుతున్నారు. వృద్ధురాలి స్థితిని చూసి చలించిపోతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు ఎంత కష్టం వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వృద్ధురాలని ఆశ్రమానికి తరలించాలని కోరుతున్నారు.

Next Story