ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రిని కారుతో గుద్దిన వైసీపీ కార్యకర్త..చివరికి ఊహించని ట్విస్ట్

by Ajay Maddhiboyina |

బీమా డబ్బుల కోసం కన్నతండ్రినే ఓ కొడుకు హత్య చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రిని కారుతో గుద్దిన వైసీపీ కార్యకర్త..చివరికి ఊహించని ట్విస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: బీమా డబ్బుల కోసం కన్నతండ్రినే ఓ కొడుకు హత్య చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని సాకుర్రు గ్రామానికి చెందిన హ‌ర్ష‌వ‌ర్థ‌న్ డిప్ల‌మా చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో తండ్రి వెంక‌ట‌ర‌మ‌ణ పేరుతో ఓ ఫైనాన్స్ సంస్థ‌లో రూ.13 ల‌క్ష‌లు అప్పు తీసుకుని బీమా చేయించాడు. తండ్రి మ‌ర‌ణిస్తే బీమా డ‌బ్బులు రావ‌డంతో పాటు అప్పు కూడా తీర్చాల్సిన పని ఉండ‌ద‌ని భావించిన హ‌ర్ష‌వ‌ర్థ‌న్ మ‌ర్డ‌ర్ ప్లాన్ వేశాడు. ఈ నేప‌థ్యంలోనే ఏప్రిల్ 21న భ‌ట్న‌విల్లి నుండి తండ్రికి ఫోన్ చేసి త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని రూ.500 తీసుకురావాల‌ని కోరాడు.

వెంట‌నే కొడుకు అడిగిన‌ట్టుగా రూ.500 తీసుకెళ్లి ఇచ్చి తిరిగి వెళుతుండ‌గా... అప్ప‌టికే అద్దెకు తీసుకున్న కారుతో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తండ్రిని వేగంగా వెన‌క నుండి ఢీ కొట్టి పారిపోయాడు. త‌ర‌వ్ఆత అత‌డే ఏమీ తెలియ‌న‌ట్టు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ప్ర‌మాదం నుండి వెంక‌ట ర‌మ‌ణ తీవ్రంగా గాయ‌ప‌డ‌గా కొద్దిరోజుల త‌ర్వాత కోలుకున్నాడు. పోలీసుల‌కు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ప్ర‌వ‌ర్త‌న‌లో అనుమానం రావ‌డంతో కేసును లోతుగా విచారించారు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ పై కేసు న‌మోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి యాక్సిడెంట్ చేసిన వాహ‌నం స్వాధీనం చేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ త‌న‌పై హ‌త్యాయ‌త్నం చేసినా.. కొడుకు జైలుకు వెళితే త‌ట్టుకోలేన‌ని అత‌డిని విడిచిపెట్టాల‌ని తండ్రి పోలీసుల‌ను వేడుకున్న‌ట్టు తెలుస్తోంది.

Next Story