- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తికోసం తండ్రిని చంపిన కీచక కొడుకు
తండ్రి ప్రేమను మరిచిపోయి.. ఆస్తికోసం ప్రాణం తీశాడు ఓ కసాయి కొడుకు. తాను పెరిగిన ముంగిట్లోనే.. తండ్రిని హతమార్చాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తండ్రి ప్రేమను మరిచిపోయి.. ఆస్తికోసం ప్రాణం తీశాడు ఓ కసాయి కొడుకు. తాను పెరిగిన ముంగిట్లోనే.. తండ్రిని హతమార్చాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో చోటుచేసుకుంది.
తాడికొండ సీఐ వాసు తెలిపిన సమాచారం ప్రకారం.. స్థానికంగా నివసించే వేల్పూరి శివయ్య (57) పల్నాడు జిల్లాలోని ఈపూరు మండలం పొనుగోటివారిపాలెంలో ఓ కోళ్లఫారంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్యతో పాటు కుమారుడు నరేంద్ర, కుమార్తె ఉన్నారు. కుమారుడు వివాహం చేసుకున్న అనంతరం శివయ్య కుటుంబ విభేదాల నేపథ్యంలో వేరుగా జీవిస్తున్నాడు. శివయ్య పేరు మీద 1.40 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి కోసం గత కొంతకాలంగా కుమారుడు నరేంద్ర ఒత్తిడి చేస్తున్నాడు. జూలై 9న రాత్రి 8.30 గంటల సమయంలో శివయ్య తన భార్య, పిల్లల వద్దకు గ్రామానికి వచ్చారు. అప్పుడే భూమిపై వాదన చోటుచేసుకుంది. "ఆస్తి రాసివ్వకపోతే చంపేస్తా" అని నరేంద్ర బెదిరించినట్టు తెలిసింది.
ఆ రాత్రే నిద్రిస్తున్న తండ్రిని నరేంద్ర గొంతు నులిమి చంపగా.. కుటుంబ సభ్యులు నిద్రలోనే తనువు చాలించినట్లుగా భావించారు. అయితే శివయ్య మృతిపై ఆయన భార్య అంజమ్మ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులు నరేంద్రను విచారించగా.. అతడు హత్య చేసినట్లు అంగీకరించాడు. సోమవారం నరేంద్రను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు సీఐ వాసు తెలిపారు.






