- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారేడుమిల్లిలో దారుణం.. తల్లిదండ్రుల్ని నరికి చంపిన కొడుకు
by Naga Rani Yarlagadda |
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని చావడికోటలో ఓ వ్యక్తి తల్లిదండ్రుల్ని గొడ్డలితో నరికి చంపాడు. మల్లిరెడ్డి అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులతో గొడవపడిన మల్లి.. ఆవేశంతో గొడ్డలితో తల్లిదండ్రులపై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మృతులు సన్యాసిరెడ్డి (68), బోడెమ్మ (62)లుగా గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మల్లిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. మల్లిరెడ్డికి మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెప్తున్నారు.
Next Story






