- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యను కాపురానికి పంపట్లేదని.. అత్తను చంపిన అల్లుడు
ప్రియుడికోసం భర్తల్ని చంపేస్తున్న భార్యలు, అనుమానంతో, గొడవల కారణంగా భార్యల్ని చంపేస్తున్న భర్తలు.. అంటూ తరచూ వార్తలొస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో భార్య, భర్తల హత్యోదంతాలు ఎక్కువవుతున్నాయి. ప్రియుడికోసం భర్తల్ని చంపేస్తున్న భార్యలు, అనుమానంతో, గొడవల కారణంగా భార్యల్ని చంపేస్తున్న భర్తలు.. అంటూ తరచూ వార్తలొస్తున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన భార్యను అత్త కాపురానికి పంపకపోవడంతో ఆమెను దారుణంగా హతమార్చాడు అల్లుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయుడుపేట మండలం అయ్యప్పరెడ్డిపాలెంలో జరిగిందీ ఘటన. కొన్నేళ్లుగా భార్యను కాపురానికి పంపడం లేదని అత్త చెంగమ్మ (47)పై అల్లుడు వెంకయ్య కక్షగట్టాడు. తాను చెప్పిన చోటికి రావాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ క్రమంలో అత్త చెంగమ్మ అయ్యప్పరెడ్డిపాలెంకు వెళ్లింది. తన భార్యను కాపురానికి పంపకపోవడంపై వాగ్వాదానికి దిగి.. కత్తితో పొడిచి చంపాడు వెంకయ్య. అనంతరం ఆమె మృతదేహాన్ని స్వర్ణముఖి నదీ (Swarnamukhi River) తీరంలో పూడ్చిపెట్టాడు. చెంగమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులు, బంధువులు వెంకయ్యను ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పాడు. దీంతో వెంకయ్యను పోలీసులకు అప్పజెప్పగా.. చెంగమ్మ మృతదేహాన్ని తవ్వి తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






