కాకాణి దుర్మార్గాలు బయటపెడతా: సోమిరెడ్డి హెచ్చరిక

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దుర్మార్గాలు బయట పెడతానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు...

కాకాణి దుర్మార్గాలు బయటపెడతా: సోమిరెడ్డి హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) నెల్లూరు పర్యటన తర్వాత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దుర్మార్గాలు బయట పెడతానని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Sarvepalli MLA Somireddy Chandramohan Reddy) తెలిపారు. కాకాణిని పరామర్శించేందుకు గురువారం జగన్ నెల్లూరులో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పులు చేసి నెల్లూరు జిల్లా జైలులో ఉన్న కాకాణి గోవర్థన్‌రెడ్డి అంతమంచి వాడా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ వల్ల చాలా మంది జైలు పాలయ్యారని, అలాంటి వాళ్లను పరామర్శించకుండా నెల్లూరు జగన్ ఎందుకు వస్తున్నాడని ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీకి సంబంధించి జగన్ మాట విని చెవిరెడ్డి, కసిరెడ్డి, ధనుంజయరెడ్డి ఇలా చాలా మంది జైలుకు వెళ్లారని, వాళ్ల కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించడంలేదని నిలదీశారు. పాలు చేసి జైలుకు వెళ్లిని వారి కోసం జగన్ వస్తున్నందుకే పోలీసులు ఆంక్షలు విధించారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story