జగన్ బయటకు వస్తే ఎవరొకరి ప్రాణాలు పోవాల్సిందే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-07 08:53:48  IST  )

మాజీ సీఎం జగన్ బయటకు వస్తే ఎవరొకరి ప్రాణాలు పోవాల్సిందేనని మంత్రి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఎద్దేవా చేశారు....

జగన్ బయటకు వస్తే ఎవరొకరి ప్రాణాలు పోవాల్సిందే..!
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(Former CM and YSRCP chief Jagan) బయటకు వస్తే ఎవరొకరి ప్రాణాలు పోవాల్సిందేనని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఎద్దేవా చేశారు. గుంటూరు, విజయవాడ జగన్ పర్యటనపై ఆయన మాట్లాడుతూ పరామర్శల పేరుతో జగన్ బల ప్రదర్శనలు చేస్తన్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడిలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, స్వర్ణ గ్రామం కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వీరాంజనేయస్వామి మాట్లాడుతూ తన పర్యటనలతో జగన్ విజయవాడలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను ప్రాణాలు తీశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించారని గుర్తుచేశారు. కూటమి పాలనలో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నామన్నామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

పబ్లిసిటీ పిచ్చితో....


‘‘నాడు పబ్లిసిటీ పిచ్చితో పాసుపుస్తకాలపై జగన్ తన బొమ్మలు వేసుకుని ప్రజాధనం దుర్వినియోగం చేశారు. నేడు రాజముద్రతో రైతులకు పాసుపుస్తకాలు అందిస్తున్నాం. కాసుల కక్కుర్తితో బాత్రూం క్లీనింగ్ కి వాడే రసాయనాలతో నెయ్యి తయారు చేసి అపచారం చేశారు. శ్రీవారి ప్రసాదం నెయ్యిలో కల్తీ జరిగిందని నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు. కానీ జగన్ అండ్ కో ఇంకా వితండవాదం చేస్తూ బుకాయించటం సిగ్గుచేటు. బూతులు తిట్టిన వారిని పరామర్శిస్తూ జగనే రాష్ట్రంలో బూతుల సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు’’. అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు.

Next Story