- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత్తులో యువతీ యువకుల వీరంగం.. మితిమీరిన వేగంతో కారు బీభత్సం
చిలకలూరిపేటలో గంజాయి మత్తులో ఉన్న కొందరు యువతీ యువకులు కారుతో వీరంగం సృష్టించారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది....

దిశ, వెబ్ డెస్క్: చిలకలూరిపేట(Chilakaluripet)లో గంజాయి(Ganja) మత్తులో ఉన్న కొందరు యువతీ యువకులు(Youth) కారు(Car)తో వీరంగం సృష్టించారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోటల్‌లోని ఫర్నిచర్, ఇతర సామాగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో హోటల్‌లో జనం తక్కువగా ఉండటంతో తృటిలో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఈ పిరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నిందితుల అరెస్ట్
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా కారు నడుపుతున్న వ్యక్తితో పాటు అందులో ఉన్నవారు గంజాయి మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నట్లు సమాచారం. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మత్తు పదార్థాల ప్రభావంతో వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడటంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.






