- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం.. బంగారం కాజేసేందుకు మాస్టర్ ప్లాన్
by Naga Rani Yarlagadda |
విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. మేలిమి బంగారాన్ని కాజేసేందుకు ప్లాన్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపుల్లో బంగారాన్ని దారిమళ్లించేందుకు ప్రయత్నించారు. అసలు బంగారాన్ని నకిలీగా మార్చేందుకు యత్నించడంతో.. ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించారు. హుండీలో వచ్చిన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కనపెడుతుండటాన్ని గుర్తించి.. టెస్ట్ చేయగా అది ఒరిజినల్ బంగారమని తేలింది. వేస్టేజ్ పై ట్రస్ట్ బోర్డు సభ్యులు తనిఖీలు చేపట్టగా.. సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వారివద్ద నుంచి రూ.1.25 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రోల్డ్ గోల్డ్ పేరుతో బంగారాన్ని దారిమళ్లించేందుకు ప్రయత్నించిన ఘటనపై ఆలయ ఈఓ శీనానాయకు చర్యలకు ఆదేశించారు. చేతివాటం ప్రదర్శించిన సిబ్బందికి మెమోలు జారీ చేసి, సమగ్ర విచారణకు ఆదేశించారు.
Next Story






