- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొంత మందికి మంచిచెడులు తెలియడం లేదు : మంత్రి నారా లోకేష్
తొలిసారి గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలు కొంత మందికి మంచిచెడులు తెలియడం లేదని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తొలిసారి గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలు కొంత మందికి మంచిచెడులు తెలియడం లేదని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కేబినేట్ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్ టీడీపీ మంత్రులతో సమీక్షను నిర్వహించారు. కొత్త ఎమ్మెల్యేలపై మంత్రులకు కీలక సూచనలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు (MLAs) తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న తీరుపై మంత్రి సమీక్షించారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి అనుభవం లేకపోవడం సమన్వయ (Co-ordination) లోపం తలెత్తుతోందన్నారు. దాని తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారని పేర్కొన్నారు. కొత్త ఎమ్మెల్యేలు సీనియర్ లతో సమన్వయం చేసుకోవాలన్నారు. వారి వద్ద పనిచేసే అనుభవాన్ని పొందాలని సూచించారు. సమస్యలను అధిగమనించేందుకు వాటిపై అవగాహన అవసరమని స్పష్టం చేశారు. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించి.. వారిని లైన్ లో పెట్టాల్సిన బాధ్యత మీదే అని మంత్రి నారా లోకేష్ ఆదేశించినట్లు సమాచారం.






