ఆస్తి కోసం దారుణం.. తల్లినీ, అక్కను చిత్రహింసలకు గురి చేసిన కుమారుడు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-27 15:46:05  IST  )

ఆస్తుల కోసం కొందరు మానవత్వం మరిచిపోతున్నారు. ...

ఆస్తి కోసం దారుణం.. తల్లినీ, అక్కను చిత్రహింసలకు గురి చేసిన కుమారుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్తుల కోసం కొందరు మానవత్వం మరిచిపోతున్నారు. సొంత వాళ్లు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ ఏదో ఓ చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా తల్లిని, అక్కను బూతులు తిడుతూ కాలుతో తన్నాడు కుమారుడు ఈ ఘటన పల్నాడు జిల్లా(Palnadu District) చిలకలూరిపేట(Chilakaluripet)లో జరిగింది. ఆస్తికోసం కుమారుడు అరాచకానికి పాల్పడ్డారు. కాలుతో తన్నుతూ పచ్చి బూతులు తిడుతూ చిత్రలు హింసలకు గురి చేశారు. దీంతో బాధితులు డయల్ 100కు ఫోన్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా ఊరి విడిచి వెళ్లిపోవాలని సలహా ఇచ్చారు. అంతేకాదు బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదు చేశారు. దీంతో బాధితులు ఊరివిడిచి వెళ్లిపోయారు. ప్రాణభయంతో ఉన్న తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

Next Story