వైఎస్ జగన్ నివాసం వద్ద ఆకతాయిల హంగామా !

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) నివాసం వద్ద కలకలం చోటుచేసుకుంది. కొం

వైఎస్ జగన్ నివాసం వద్ద ఆకతాయిల హంగామా !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) నివాసం వద్ద కలకలం చోటుచేసుకుంది. కొంత మంది ఆకతాయిలు... వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ( YS Jaganmohan Reddy Home)వద్ద హంగామా సృష్టించే ప్రయత్నం చేశారు. కారులో వచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిలోకి తాటికాయ ముంజలు.. విసిరారు ఆకతాయిలు. అయితే అదృష్టవశాత్తు ఆ తాటికాయలు ఎవరికి తగలలేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటిముందు నిర్మించిన సెక్యూరిటీ బారీకేడ్ల దగ్గర ఆ తాటికాయలు పడిపోయాయి.

దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలను వైసిపి పార్టీ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని... ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైసిపి ఫైర్ అవుతోంది. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అటు వైసిపి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు హెచ్చరించినా... జగన్మోహన్ రెడ్డికి Z + కేటగిరి భద్రత కల్పించటంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Twitter Link

Next Story