- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: ప్రాణం పోతున్నా పట్టించుకొని సమాజం.! గుంటూరు జిల్లాలో విషాద ఘటన వైరల్
గుంటూరు జిల్లా కూరగల్లులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు జిల్లా కూరగల్లులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. ఓవర్‌టేక్ చేసే సమయంలో నియంత్రణ కోల్పోయిన బైక్ టిప్పర్ వాహనం కింద పడి, బైకర్ చక్రాల కింద నలిగిపోయాడు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే వచ్చిన టిప్పర్ రెండు టైర్లు వరుసగా అతని తలపై నుంచి దూసుకెళ్లాయి. తీవ్ర గాయాలతో నేలపై కొట్టుమిట్టాడుతున్న యువకుడు ప్రాణం కోసం పోరాడుతున్నా, అక్కడున్న చాలామంది చూస్తూ ఉండిపోయారు తప్ప సహాయం చేయడానికి మాత్రం ఎవరు ముందుకు రాలేదు. కొంత సమయంలోనే తీవ్ర రక్తస్రావానికి గురైన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈ దుర్ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనను చూసిన నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రమాదాన్ని చూశాక కూడా స్పందించకపోయినా పక్కన ఉన్న ప్రజల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రాణం పోతున్నా సమాజం పట్టించుకోవడం లేదని నెటిజన్‌లు మండిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కనీసం అంబులెన్స్‌కు ఫోన్ చేయాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కనీసం దగ్గరికి కూడా పోలేదు కదరా’ ‘వీరిపై ఏమైనా కేసులు నమోదు అవుతాయని ఎవరు కూడా దగ్గరకు వెళ్లడం లేదు’ అని నెటిజన్‌లు కామెంట్స్ చేశారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. వీడియో ఇదే..






