- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పటి వరకు 11 మృతదేహాలు వెలికితీశాం.. కర్నూలు కలెక్టర్ సిరి కీలక ప్రకటన
ఇప్పటి వరకు 11 మృతదేహాలు వెలికితీశాం.. కర్నూలు కలెక్టర్ సిరి కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, బస్సు అంతా వ్యాపించాయి. చూస్తుండగానే క్షణాల్లో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో పలువురు ప్రయాణికులు మరణించినట్లుగా సమాచారం. అయితే, తాజాగా ఘటనా స్థలాన్ని కర్నూలు కలెక్టర్ సిరి (Collector Siri) పరిశీలించారు. ఇప్పటి వరకు 41 మంది ప్రయాణికుల్లో 20 మందిని గుర్తించామని అన్నారు. అదేవిధంగా బస్సులోంచి మొత్తం 11 మృతదేహాలను వెలికితీశామని, 20 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. కనిపించకుండాపోయిన 21 మంది ప్రయాణికుల్లో 11 మృతదేహాలు మాత్రమే లభించాయని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు వివరాల కోసం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నెం. 08518-277305కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని కలెక్టర్ సిరి వెల్లడించారు.
Read More: కర్నూలు బస్సు ప్రమాదం.. ప్రయాణికుల పూర్తి జాబితా ఇదే!






