నిద్రపోతున్న చిన్నారులను కాటేసిన పాము.. తమ్ముడు మృతి, అన్నకు సీరియస్

by Muthe.Rajitha |

ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న చిన్నారులను పాము కాటు వేయడంతో తమ్ముడు మృతి చెందగా.. అన్న పరిస్థితి సీరియస్ గా ఉంది.

నిద్రపోతున్న చిన్నారులను కాటేసిన పాము.. తమ్ముడు మృతి, అన్నకు సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న చిన్నారులను పాము కాటు వేయడంతో తమ్ముడు మృతి చెందగా.. అన్న పరిస్థితి సీరియస్ గా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కండ్లగూడూరులో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు అన్నదమ్ములను పాము కాటు వేసింది. నొప్పితో విలవిలలాడుతున్న పిల్లలను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చిన్న కుమారుడైన శివనారాయణ మృతి చెందాడు. అన్న శివరామరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు కుమారుల్లో ఒకరిని కోల్పోవడం, మరొకరి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో తల్లిదండ్రుల పరిస్థితి హృదయ విదారకంగా మారింది. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

Next Story