ఏపీకి పొగ మంచు హెచ్చరికలు.. కీలక సూచనలు జారీ చేసిన వాతావరణశాఖ

by Ajay Maddhiboyina |

ఏపీకి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రానికి పొగమంచు ఎఫెక్ట్ ఉన్నట్టు పేర్కొంది. ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

ఏపీకి పొగ మంచు హెచ్చరికలు.. కీలక సూచనలు జారీ చేసిన వాతావరణశాఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రానికి పొగమంచు ఎఫెక్ట్ ఉన్నట్టు పేర్కొంది. ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ పొగమంచు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కాబట్టి పండగకు వెళ్లి తిరుగు ప్రయాణాలు చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇదిలా ఉంటే పొగమంచు కారణంగా వాహనాలకు ప్రమాదం పొంచి ఉందన్న సంగతి తెలిసిందే. పొగమంచు కారణంగా ముందు వెళుతున్న వాహనాలు సరిగా కనిపించ ఒకదానినొకటి ఢీ కొట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక ఈ రోజు కూడా రాష్ట్రంలో చాాలాచోట్ల పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అయితే ఉదయం 9గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉంది. దీంతో ఉదయం 9గంటల వరకు వాహనదారులు ఇబ్బందిపడ్డారు. విజయవాడ హైదరాబాద్ హైవేపై రాకపోకలకు ఇబ్బంది నెలకొంది.

Next Story