ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు : మంత్రి నాదెండ్ల

by Naga Rani Yarlagadda |

నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తున్నామని, పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు అవిరళ కృషి చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు : మంత్రి నాదెండ్ల
X

దిశ, వెబ్‌డెస్క్: నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తున్నామని, పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు అవిరళ కృషి చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్ లో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెలా 26-30 వరకూ ఇంటివద్దకే అందిస్తున్నట్లు చెప్పారు.

గ్యాస్ రాయితీ గురించి మాట్లాడుతూ.. దీపం పథకం ద్వారా ఫేజ్-1లో కోటిమందికి, ఫేజ్-2లో 95 లక్షల మందికి సబ్సిడీ అందించినట్లు తెలిపారు. ఇక ఫేజ్-3లో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించి లబ్ధిదారులకు రాయితీ అందేలా చర్యలు చేపడుతామని తెలిపారు. లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కాకపోతే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక.. ఆగస్టు 25వ తేదీ నుంచి రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల్ని అందజేస్తామని తెలిపారు. రేషన్ అక్రమ తరలింపుపై నిఘా పెంచామని, చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చామని వివరించారు.

Next Story