నైపుణ్యం పోర్టల్‌ను ఆగస్టు నాటికి పూర్తి చేయాలి: మంత్రి లోకేశ్

by Yella Dhawani Reddy |

విదేశాల్లో ఉపాధి అవకాశాలు అన్వేషిస్తున్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

నైపుణ్యం పోర్టల్‌ను ఆగస్టు నాటికి పూర్తి చేయాలి: మంత్రి లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: విదేశాల్లో ఉపాధి అవకాశాలు అన్వేషిస్తున్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నైపుణ్యం పోర్టల్‌ను ఈ ఆగస్టు నాటికి పూర్తిచేయాలని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సంబంధిత అధికారులకు ఆదేశించారు. సెప్టెంబర్ 1న ఈ పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఉండవల్లిలోని నివాసంలో సమీక్ష నిర్వహించారు. పోర్టల్ రూపకల్పన, శిక్షణా మాడ్యూళ్లు, కౌన్సిలింగ్ సదుపాయాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు.

ఈ పోర్టల్ ద్వారా యువతకు అవసరమైన శిక్షణలతో పాటు విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు ఓంక్యాప్ (OMCAP) ద్వారా కల్పించాలన్నారు. అలాగే, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పారు. వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్‌లైన్‌ నెంబర్ 0863-2340678, లేదా వాట్సాప్ నెంబర్ 85000 27678ను సంప్రదించాలని తెలిపారు. ఇటీవల థాయ్‌లాండ్‌లో ఉద్యోగాల పేరుతో ఏజెన్సీల చేతిలో మోసపోయిన వారిని ఓంక్యాప్, ఎన్ఆర్‌టీ ద్వారా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్‌ ఆదేశించారు.

Next Story