Minister Lokesh : సెప్టెంబర్ లో స్కిల్ పోర్టల్ : మంత్రి లోకేష్

by Muthe.Rajitha |

వచ్చే సెప్టెంబర్ లో స్కిల్ పోర్టల్(Skill Portal) ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్(Minister Lokesh) అధికారులను ఆదేశించారు.

Minister Lokesh : సెప్టెంబర్ లో స్కిల్ పోర్టల్ : మంత్రి లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : వచ్చే సెప్టెంబర్ లో స్కిల్ పోర్టల్(Skill Portal) ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్(Minister Lokesh) అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక సలహాలు, సూచనలు చేశారు. ఈ మేరకు మంత్రి లోకేష్ తన X ఖాతా వేదికగా ట్వీట్ చేస్తూ.. "90 రోజులపాటు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.

నైపుణ్యం పోర్టల్ లో ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా రెజ్యుమ్ సిద్ధమయ్యేలా తీర్చిదిద్దాలని ఆదేశించాను. ఇటీవల ఢిల్లీ పర్యటన అనంతరం ఐటీఐల అభివృద్ధికి హబ్ అండ్ స్పోక్ విధానంలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం ద్వారా రూ.600 కోట్లు కేటాయించడం జరిగింది." అని పేర్కొన్నారు.

Next Story